Friday, December 5, 2008

ప్రెస్సుమీట్

ఎన్నికలు రాభోతున్నందున ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మార్పులను సూచించే వారికి మన బ్లాగును పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? దీని నిర్వాహణ వల్ల ఎటువంటి కర్చు లేదు. ఎలా బ్లాగులోకి రావాలో వివరంగా పత్రికా సమావేశం లో వివరించి ప్రజలను ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచిస్తారని బావిస్తున్నాను.

Tuesday, December 2, 2008

కొత్తబిచ్చగాడు

ప్రజారాజ్యం పార్టీలో ఈ మధ్య చేరిన ఒకతను ఈ రోజు కలిసాడు. అతనికి రాజకీయాలలో ఎంత అనుభవం ఉందొ నాకు తెలుసును. కాని అతని ప్రవర్తన చాల వింత అనిపిస్తున్నది. అతను పలు దినపత్రికలలొ వచ్చిన తన ప్రకటనలు , చిన్న చిన్న సేవా కార్యక్రమాలు , వాటికి సంభదించిన ఫోటోలు సేకరించి వాటిని అందరికి చూపిస్తూ , నేను శాసనసభ్యుడను అవుతున్నాను అనే భ్రమలో ఎంత తోస్తే అంత చెబుతూ , ఎంత గర్వంగా ప్రవర్తిసున్నాడో . మరి పరిపాలన ఎలా చేస్తారు అనే ప్రశ్న అతనికి అతనికి తట్టిందా , లేదా అనేది ఆ భాఘవంతునికి తెలియాలి.

Thursday, November 27, 2008

సాన్ఘెకభద్రతకార్దు

బొంబాయి అల్లర్లు కొత్తవి ఏమి కావు. ఇప్పటికి అయిన ప్రభుత్వం ప్రజలందరికీ సాంఘీక భద్రత గుర్తింపు కార్డు నెంబర్ ఇచ్చి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. సంఘటన తరువాత జరుగే హంగామా తప్ప తీసుకున్న చర్యలు ఉండటం లేదు. వీటి పరిష్కారాన్ని కనిపెట్టాలి.

Tuesday, November 25, 2008

సమాజం పట్ల పౌరిడికి భాద్యత

ఈ రోజు హైకోర్టు రోడుశోల ఫై స్టేఇవ్వడం చాల ఆనందదాయకం .రోడుశోల ఫై స్టేఇవ్వడం సమాజం ఫై ప్రజలకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది . ప్రతి రోజు ఏదో ఒక ధర్నా, రోడుశో, నిర్వహిస్తూ ప్రజల మానసిక పరిస్తితిని పరీక్షిస్తున్నారు . పదిమంది కలిసి ధర్నా చేస్తే వందలమంది భాదలనుభవిస్తున్నారు. సినికలాకారుల రోడుశోలు చేసే మంచి కన్నా , జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. ఈ రోజు హైకోర్టు తీసుకున్న చర్య ప్రశంసనీయమనది.

Sunday, November 23, 2008

పోర్టల్


మనము అందరం కలిసి ఒక పోర్టల్ ఉదాహరణకు మన బ్లాగ్లోపలికి రావడానికి చాల మందికి తెలియక ఎవరికీ వారే గ ఉండిపోతున్నారు . ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలు తెలియచేసే అందుకు రాజకేయవేదిక ఒకదాన్ని పోర్టల్ ద్వారా నిర్వహిస్తే బాగుండును కదా.

పరిపాలనలో - నూతనవిధానం

ఈ రోజు రాజకీయ అవినీతి అనే చర్చాగోష్టి లో పాల్గొన్నాను. పాత చింతకాయ పచ్చడిని పంచారు, సభ జరిగిన తీరు తిన్నామా,పడుకున్నామా,తెల్లారిందా అనే రీతిలో కొనసాగింది. పరిపాలనలో కొత్త విధి విధానాలను ప్రవేశపెట్టి నూతన పరిపాలన చేపట్టాలి. ఈ క్రింది మార్పులు చేస్తె, మంచి పరిపాలనను మన రాష్ట్రంలో అందించ వచ్చు..బూమి మీద యాజమాన్యపు హక్కును భారత పౌరిడికి లేకుండా చేయాలి. గృహవసతిని ప్రభుత్వమే కల్పించాలి. ఉచిత విద్యను ఎతరులప్రమెయమ్ అనగా ప్రియ్వేటు వారు గాని ఇతరులు గాని వారికి లేకుండా ప్రభుత్వమే అందించాలి.... ఉచిత వైద్యం ప్రజలందరికీ కల్పించాలి..... ప్రతి పౌరిడికి సాంఘిక భద్రత గుర్తింపు నెంబర్ ఇవ్వాలి..... ఇప్పుడున్న ప్రజస్వామ్యాన్నే కొనసాగించాలి.... పది మంది సర్పంచులకు కలిపి ఒక మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ,అదే ప్రాంగణములో పోలీస్ స్టేషన్ , న్యాయస్థానం, వ్యయసాయకేంద్రం, రయితుభజారు, ఆసుపత్రి, అన్నింటిని ఒకే చోట ఏర్పాటుచేయాలి..... ఒక ఇఎస్ ను కాని ఒక ఇపీస్ ను గాని తొలగించే అదికారాన్ని ఆపది మంది సర్పంచులకు కల్పించాలి.... శాసనసభ్యులను తొలగించే అదికారాన్ని ఆ శాసనసభా నియోజకవర్గ గ్రామ సర్పంచులకు కల్పించాలి..... ఈ విధానాల మీద మీ ఆలోచలను తెలియచేయండి.

Sunday, November 16, 2008

అభివృద్ది-మనుగడ, ప్రత్యామ్నాయ నమూనా

మొదటి విషయం: ఈ బ్లాగు మనందరిది. అందరం కలిసి నిర్మిద్దాం.

అసలు విషయం: అభివృద్ది, మనుగడల్ని ఎలా సమన్వయం చేయాలనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ రోజు భూమ్మీద కొందరి అభివృద్ది ఇంకొందరి మనుగడని ప్రశ్నార్దకం చేస్తున్నది. ఇంకొద్ది రోజులు పోతే అందరి అభివృద్ది అందరికీ మనుగడ ప్రశ్నలా మిగిలిపోతుంది.

నిజానికి మనిషికి ఉన్న తెలివికి అభివృద్ది అనేది మనుగడ అవకాశాల్ని పెంచేదిగా,పరిపోషించేదిగా ఉండాలి. అభివృద్ది మనుగడలు పరస్పరాశ్రితాలుగా ఉండాలి. కానీ అవి నేడు పరస్పర విరుద్దాలుగా మారాయి. వనరుల్ని సంరక్షించుకోవడం, సక్రమంగా షేర్ చేసుకోవడంలోనే మన మనుగడ ఆధారపడి ఉంది. కానీ తెలివైన వాడు, బలమున్నవాడు వాటిని దోచుకోవడం, విశృంఖలంగా వినియోగించడం నేడు జరుగుతున్నది. దీనికెవ్వరమూ సిగ్గుపడడం లేదు సరికదా ఇదే అసలు జీవనవిధానం అనుకొనేటంతగా మారిపోయాము. వినిమయం తప్పిస్తే ఇక వేరే జీవితపు విలువలేవీ కనపడడంలేదు. ఎప్పుడైనా బుద్ది ఆలోచిస్తే అదంతా పెట్టుబడిమీదో, అమెరికా మీదో, రాజకీయాల మీదో ఇంకా ఏదో ఒక భూతం మీదో నెపాన్ని నెట్టేసి హాయిగా నిద్దురపోతాం.

మానవ స్వభావము, సహజాతాలు ( ఇన్ స్టింక్ట్స్ ), శాస్త్రము, టెక్నాలజీ, ఉత్పత్తి విధానాలు, సామాజిక గమనము, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు,విలువలు, సమానత్వము, భవిష్యత్తు, భావజాలాలు, సిద్దాంతాలు మొదలైన అనేకవిషయాలతో కూడిన ఈ విషయ చర్చ చాలా క్లిష్టంగా తయారైనది. నిజానికిది కొత్త చర్చ ఏమి కాదు. కాకపొతే ఎవరికి వారు వారి సిద్దాంతాల దృష్టితోటే చూస్తూ వాఖ్యానిస్తున్నారు. దాన్ని ఆసాంతంగా పరిశీలించి చర్చను సంపూర్ణం చేయడంలేదు. పెట్టుబడిదారుల్ని నిందించే సమయంలో కమ్యూనిస్టులు, ప్రజలని విస్మరించిన అభివృద్ది ప్రణాలికల్ని వ్యతిరేకించే క్రమంలో పర్యావరణవేత్తలు, మన ప్రాచీన సంస్కృతే గొప్పదని వాదించే సాంప్రదాయవాదులు, గ్లోబలైజేషన్ ని వ్యతిరేకించే సమయంలో మన మేధావులు,సాహితీవేత్తలు, ప్రజాసంఘాలు ఈ చర్చని ఇలా స్పృశించి అలా వదలివేస్తారు. అంతేకానీ ఈ చర్చని ప్రత్యేకంగా,నిర్దేశితంగా,నిర్దుష్టంగా ముందుకు తీసుకెళుతున్న దాఖలాలు కనపడడం లేదు.

ఈ చర్చ చాలా విస్తారమైనది. బహుముఖాలున్నది. వైవిధ్యమున్నది. ఈ చర్చలో భాగంగా ఎన్నో వైరుధ్యాలకు పరిష్కారాలని కనుగొనవలసి ఉంటుంది. చాలా రంగాల్లో ఇప్పటికే ఈ చర్చ చాలా సీరియస్ గానే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్దికి పునర్నిర్వచనాన్ని కనుగొని ఆచరిస్తున్న సమాజాలు, సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. కానీ తెలుగు మేధో రంగం మీద ఈ విషయాన్నే కేంద్రకంగా తీసుకొని చర్చ జరగడం లేదు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చర్చించాల్సిన అవసరాన్ని ప్రత్యేకించి కల్పిస్తున్నాయి. సెజ్ లపై వ్యక్తమౌతున్న వ్యతిరేకత, భూముల బదలాయింపులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో తలెత్తుతున్న నిర్వాసితుల సమస్యలు మొదలైన విషయాలతో ఈ చర్చ మొదలైనది. ఈ విషయాలపై మాట్లాడుతున్న వాళ్ళు, సిన్సియర్ గా పోరాడుతున్న వాళ్ళు సమస్యని గుర్తిస్తున్నారు. మొదలు వారి పోరాట స్ఫూర్తికి వందనాలు. అంతే కానీ ఇది కాదు అభివృద్ది. ఇంకో రకమైన అభివృద్దికి ఆస్కారం ఉంది అని ప్రత్యామ్నాయాల్ని నిర్దిష్టంగా ఎవరూ ముందుకు తేవడం లేదు. ఒక నమూనాని వ్యతిరేకించినప్పుడు ఇంకో నమూనాని తప్పనిసరిగా ముందుకు తేవాలి. అది మన పని కాదు అంటే కుదరదు. మన వాళ్ళ శక్తి అంతా పోరాటాలని ముందుకు తీసుకెళ్ళడానికే సరిపోతుంది. నమూనాల నిర్మాణాలకు శక్తి మిగలడంలేదు. పోరాటాలు నడుపుతున్న వారి సైద్దాంతిక నేపధ్యాలు కూడా దీనికి కొంత కారణం కావచ్చు. తమతమ సిద్దాంతాలే సమాజంలో అంతిమ మార్పుని తెస్తాయనే నమ్మకం కావచ్చు.

ఈ చర్చని అందరం కలిసి సంపూర్ణం చేద్దామని మొదలు పెట్టాను. సౌలభ్యం కోసం మొదలు కొన్ని భాగాలుగా చేసుకొందాం. ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా చర్చిద్దాం. చర్చిస్తూ రాయడం , అందరూ కలిసిరాయడం అనేవి కొత్తవిషయాలు. ఈ బ్లాగు మాధ్యమం మనకు ఆవీలును,వేదికను కల్పిస్తున్నది. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ. మొత్తం పూర్తయితే ఒక పుస్తకం అవుతుంది. దానికి ఒక్క రచయిత ఉండడు. దాని అందరూ రచయితలే. బ్లాగర్లందరి తరపున పుస్తకంగా అచ్చు వేయిద్దాము. ఈ విషయం కూడా చాలా విశాలమైనది, లోతైనది, సంక్లిష్టమైనది. ఒక్కరుగా రాస్తే దాని అన్నికోణాలు స్పృశించగలుగుతామో లేదోనన్న అనుమానం కూడా ఉంది. దానికి చాలా సమాచారం అవసరం ఉంది. నిపుణుల విశ్లేషణ అవసరం. మనలో ఎవరెవరికి ఏ విషయంలో ప్రావీణ్యం ఉందో ఆ విషయ సందర్భంలో దాన్ని అందించాలి. అందరి రాతలను ఒక్కచోట ఒకసారి చేరి కూర్చొని ఎడిట్ చేసి ఫైనల్ చేద్దాము. రాసిన ప్రతీ విషయం ఈ ఎక్కౌంట్ లోనే కాక ఇంకో ఎక్కౌంట్ లో కూడా భద్రపరుస్తాను. బ్లాగర్లు కాని వారిని కూడా చర్చలో పాల్గొనమని ఆహ్వానిద్దాం. ఎవరికి వీలైనంతవరకు బయటివారిని కూడా సంప్రదించి చర్చలోకి ఆహ్వానిద్దాం.

నాగరికత అంటే ఏమిటి.

అభివృద్ది అంటే ఏమిటి.

శాస్త్ర సాంకేతిక అభివృద్ది సమాజం మీద ఏ ప్రభావం చూపుతుంది.

మానవుని సహజాతాలు, మనస్తత్వము, సాంఘిక ప్రవర్తనలు ఏవిధంగా ఉంటాయి. విద్యతో వచ్చేమార్పేమిటి.

ఉత్పత్తి సంబంధాలు కాలక్రమేణా ఎలాంటి మార్పులు చెందుతాయి.

విలువలు ఏవిధంగా పరిణామం చెందుతాయి.

భూమ్మీద జనాభా ఏ విధంగా పెరిగిపోతున్నది.

వనరులు యెన్ని ఉన్నాయి.

అందరికీ అన్నీ దొరుకుతాయా.

శిలాజ ఇంధానాలు ఎన్ని ఉన్నాయి.

వాటి వినియోగంలో ప్రాధాన్యతలేమిటి.

టెక్నాలజీ అన్ని సమస్యలకి పరిష్కారం చూపగలుగుతుందా.

ఏ మేరకు సమాజం మానసికంగా సర్దుబాటుని అంగీకరించాలి, ఆచరించాలి.

శ్రమని నిరాకరించుకొనే నాగరికత మనగలుగుతుందా.

సంస్కృతి ఏ విధంగా పరిణమించాలి.

సాంప్రదాయ,స్థానిక సంస్కృతుల్ని పరిరక్షణ అవసరం ఏమిటి.

మొత్తం పాతవి పనికి వస్తాయా. వాటిల్లో సంస్కరణలు ఏ విధంగా ఉండాలి.

పర్యావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయి. వాటిని ఎలా తట్టుకోవాలి.

రాజకీయ కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి.

ప్రజాస్వామిక సంస్థల పాత్ర ఏమిటి.

ఆధ్యాత్మిక పరిష్కారాలు పనిచేస్తాయా.

కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రభావం ఏమిటి.

వ్యవస్థ తెరచి ఉండాలా, మూసిఉండాలా.

గ్లోబలైజేషన్, లోకలైజేషన్లని ఎలా ఎంపిక చేసుకోవాలి.

వ్యవస్థల మధ్య విజ్ఞానవినిమయం, పదార్ద-వస్తు వినిమయం ఏ విధంగా ఉండాలి.

ఆదిమ జాతుల పరిరక్షణ సాధ్యాసాధ్యాలు

జీవజాతుల పరిరక్షణ

ఆహారోత్పత్తి,వ్యవసాయ విధానాలు

క్రొత్త ఉత్పత్తి విధానాలు, వ్యాపార విధానాలు.

జీవనశైలి మార్పు, నూతన విలువలు.

పై విషయాల హెడ్డింగ్ లతో ఒక్కొక్క పోస్టు ప్రచురిద్దాము. ఒక విషయం గురించిన చర్చలో ఇంకొక విషయ ప్రస్తావన కూడా వస్తుండ వచ్చు. కాబట్టి విషయాల విభజన సౌలభ్యం కొరకు మాత్రమే. ఎవరికి అనిపించింది వారు వారికి తోచిన క్రమంలో రాయవచ్చు.

బ్లాగర్ సైటు : http://www.blogger.com/

బ్లాగర్ యూజర్ నేం: manamu.manadi

పాస్ వర్డ్ : sarvejanaha

బ్లాగు సైటు : http://manamumanadi.blogspot.com

ఎవరైనా పై బ్లాగర్ అక్కౌట్ లోకి లాగిన్ అయ్యి విషయాన్ని చేర్చవచ్చు. మార్చవచ్చు. ఇలా పబ్లిక్ గా అందరూ కలిసి రాయడంలోని సాంకేతిక సమస్యల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలుపగలరు.

ముఖ్య గమనిక: విషయాన్ని పొడిగింపుగానే రాయవలెను. రాసి దానికిందనో,మీదనో అవసరం అనుకొంటే తమ పేరు చేర్చవచ్చు. ఇదివరకు రాసిన విషయంలో తప్పులు ఉంటే సూచన మాత్రమే చేయవలెను. ఎడిట్ చేయవద్దు. విభేదించే విషయాలుంటే కామెంట్లు రాయవచ్చు. కామెంట్ల ద్వారా చర్చించవచ్చు. చర్చకు సంబంధంలేని విషయాలు, సైద్దాంతిక విభేదక చర్చలు దయచేసి రాయవద్దు. అవి చర్చలోకి అనివార్యంగా వచ్చినా కూడా వాటికి మీదకాకుండా చర్చని దాని ఉద్దేశ్యిత విషయం మీదనే కేంద్రీకరించాల్సిందిగా మనవి.

బ్లాగులు రాసేవాళ్ళందరము ఈ పబ్లిక్ స్థలాన్ని బాధ్యతతో నిర్మించి నిర్వహించి ఫలవంతం చేద్దాము. మన అభివృద్దికి మనుగడని ముడిపెట్టి, మనగల అభివృద్దిని కనుగొందాం..