Sunday, November 23, 2008

పరిపాలనలో - నూతనవిధానం

ఈ రోజు రాజకీయ అవినీతి అనే చర్చాగోష్టి లో పాల్గొన్నాను. పాత చింతకాయ పచ్చడిని పంచారు, సభ జరిగిన తీరు తిన్నామా,పడుకున్నామా,తెల్లారిందా అనే రీతిలో కొనసాగింది. పరిపాలనలో కొత్త విధి విధానాలను ప్రవేశపెట్టి నూతన పరిపాలన చేపట్టాలి. ఈ క్రింది మార్పులు చేస్తె, మంచి పరిపాలనను మన రాష్ట్రంలో అందించ వచ్చు..బూమి మీద యాజమాన్యపు హక్కును భారత పౌరిడికి లేకుండా చేయాలి. గృహవసతిని ప్రభుత్వమే కల్పించాలి. ఉచిత విద్యను ఎతరులప్రమెయమ్ అనగా ప్రియ్వేటు వారు గాని ఇతరులు గాని వారికి లేకుండా ప్రభుత్వమే అందించాలి.... ఉచిత వైద్యం ప్రజలందరికీ కల్పించాలి..... ప్రతి పౌరిడికి సాంఘిక భద్రత గుర్తింపు నెంబర్ ఇవ్వాలి..... ఇప్పుడున్న ప్రజస్వామ్యాన్నే కొనసాగించాలి.... పది మంది సర్పంచులకు కలిపి ఒక మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ,అదే ప్రాంగణములో పోలీస్ స్టేషన్ , న్యాయస్థానం, వ్యయసాయకేంద్రం, రయితుభజారు, ఆసుపత్రి, అన్నింటిని ఒకే చోట ఏర్పాటుచేయాలి..... ఒక ఇఎస్ ను కాని ఒక ఇపీస్ ను గాని తొలగించే అదికారాన్ని ఆపది మంది సర్పంచులకు కల్పించాలి.... శాసనసభ్యులను తొలగించే అదికారాన్ని ఆ శాసనసభా నియోజకవర్గ గ్రామ సర్పంచులకు కల్పించాలి..... ఈ విధానాల మీద మీ ఆలోచలను తెలియచేయండి.

1 comment:

  1. పెద్ద ప్రభుత్వాలలో, పైనుండి క్రిందికి నిర్మించబడిన వ్యవస్థలలో పైవాళ్ళ ప్రయోజనాలే నెరవేరుతాయి కానీ కింద ఉన్న ప్రజలవి కావు. స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వమనేది అందుకే. మనం ప్రస్తుతం ఉన్న ఈ పై నుండి కిందికనే విధానం పోవాలి. అది కూడా పైవాళ్ళ చేతుల్లోనే ఉండడం మనకున్న దౌర్భాగ్యం. లోక్ సత్తా దీన్ని సరిగ్గానే గుర్తించింది. పైనుండి ఎంత కిందికి రావాలనేది, ఏ సైజు వయబుల్ అనేది ముఖ్యం. గ్రామం యూనిట్ గా తీసుకొంటే అది కూడా వయబుల్ కాదు. మండలం సైజు వయబుల్ గానే ఉంటుంది.

    ReplyDelete