Sunday, November 1, 2009
Wednesday, January 28, 2009
ఆశ - అడియాస
కొత్త సంవత్సరం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మనకు దొరతనపు దోపిడీలకు పాల్పడుతున్న పాలకులు, మానభంగాలకు పాల్పడుతున్న వారి సంతానం ,కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సంపాదనను స్టాకు మార్కెట్టు దళారుల మాయాజాలం తో తుడిచి పెట్టుకుపోతున్న తరుణంలో , అసలు ఎవరి కొరకు మన ప్రభుత్వము పని చేస్తున్నదో అర్తం కావడం లేదు. గాలి బుడగల మీద ఎన్ని రోజులని నడవాలి? తీరు మారాలిసింది మనలోనన లేక పాలకులలోనన , తేల్చుకునే సమయము వస్తున్నది, వోటు వేయడం లో నిర్లిప్తత వహిస్తే మల్లి అయిదు ఏల్లు నడిచేందుకు గాలిబుడగలు కూడా ఉండవు అనే చేదునిజం తప్ప ప్రయోజనం ఉండదు. మనలని నీది, నీకు, నీస్వంతం, నీకోసమే అని విభజించే దళారుల పాలనకు స్వస్తి పలుకుదాం. మన దేశంలో నూటికి డెబ్బై మందికి భూమి పయి ఎలాంటి హక్కు లేకుండా జీవిస్తున్నారు . అలాంటప్పుడు భూమి మీద యాజమాన్యపు హక్కు మనకు లేకుండా చట్టం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉండవుకదా. మీరు ఆలోచించండి , మీ ఆలోచనను ఇతరులతో పంచుకోండి, కొత్త జవాభు దొరుకుతుందేమో ప్రయత్నిద్దాము.
Thursday, January 1, 2009
మన కుటుంబ జీవితం ప్రమాదంలో పడింది
(బ్లాగ్మితృలందరికీ 2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సమాజ హితాన్ని కోరే చర్చలకు ఆహ్వానం పలుకుతూ బ్లాగర్లందరూ టపాలు రాయగలిగే విధంగా ‘అభివృద్ధి-మనుగడ’ అనే ఉమ్మడి బ్లాగును ఏర్పాటు చేసినందుకు సీతారాంరెడ్డి గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు)
ఒక వ్యక్తి కుటుంబంలో కొనసాగే విధానానికీ, సమాజంలో కొనసాగే విధానానికీ చాలా తేడా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తి బాల్యం వలనో, వృద్ధాప్యం వలనో లేక మరేదైనా కారణం వలనో డబ్బు సంపాదించలేకపోయినా కూడా మిగతా కుటుంబ సభ్యులతో సమానంగా తన అవసరాలను తీర్చుకోవచ్చు.. అన్నీ అనుభవించవచ్చు. కానీ సమాజంలో అలా కాదు. ఎవరు సంపాదించినది వారికే. ఎవ్వరూ ఎవరికీ ఇవ్వరు. శక్తి కలిగి ఎక్కువ సంపాదించగలిగితే కోట్లు కూడబెట్టవచ్చు. ఆ ఆస్తి నంతా మన అనుభవానికి అట్టిపెట్టుకోవచ్చు. శక్తి లేక సంపాదించలేకపోతే నిష్టదరిద్రాన్నైనా అనుభవించక తప్పదు. ఆ పరిస్థితిని మిగతావారు చూస్తూ ఉండిపోతారు తప్ప పెద్దగా ఎవరూ ఆదుకోరు. తప్పు వారిది కాదు. వ్యవస్థే వారినలా నిర్దేశించినది.
ఇటువంటి వ్యవస్థ వలనే కుటుంబ జీవితం కష్టభూయిష్టంగా మారింది. సమాజంలో కొద్దిమంది సకల సుఖాలు అనుభవిస్తుంటే అనేకులు తమ అవసరాలు తీరక అప్పులతోనో, గర్భదరిద్రంతోనో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. కొందరు ఆత్మహత్యతో అటువంటి బ్రతుకు నుండి విముక్తి పొందుతున్నారు. ప్రస్తుత సామాజిక వ్యవస్థలో మనిషి యొక్క కనీస జీవన ప్రమాణాలకు ఎటువంటి హామీ లేదు. సామాజిక జీవితం అనేది ప్రతిఒక్కరికి కూడా… ఓడిపోతే తమ సుఖసంతోషాలను, తమ సౌభాగ్యాలను, ఆఖరికి తమ ప్రాణాలనే ఒడ్డవలసిన ‘తప్పనిసరి జూదం’ గా మారింది. సమాజంలో అనేకమంది శాపగ్రస్థ జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది.
ప్రేమ, ఆప్యాయతలకోసం, ‘నా’ అనే వారి కోసం వ్యక్తి కుటుంబాన్ని ఏర్పరచుకుంటే, దాన్ని అవకాశంగా తీసుకుని ఆ కుటుంబ సభ్యుల భారమంతా అతనే వహించాలనటంలో ఏపాటి హేతుబద్ధత ఉన్నది ?! నిజమే…వ్యవస్థీకృత నేపథ్యం ‘కుటుంబ యజమానే కుటుంబ సభ్యులనందరినీ పోషించాలి’ అన్నట్లుగా ఉన్నది. ‘ఇది చాలా సహజసిద్ధమైన బాధ్యత’ అన్నట్లుగా ఉన్నది. (కనుకనే ఎవరూ మారు పలకకుండా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు) కనుక మనం ఈ నేపథ్యం కన్నా అతీతంగా, మరింత మౌలికంగా ఆలోచించాలి.
అసలు ఈ భూమి మీద మనుగడ సాగించే మనిషి పోషణాభారం ఎవరిది ? అతని అవసరాలు తీర్చే బాధ్యత ఎవరిది ?
…మనిషినే కాదు, ఏ జీవినైనా పోషించవలసినది, పోషించగలిగినది ఎన్నో వనరులున్న ప్రకృతే. సామాజిక జీవి ఐన మనిషి విషయంలోనైతే ఆ ప్రకృతి వనరులను తన అధీనంలో ఉంచుకున్న సమాజానిది. మరైతే మనుషులలో ఈ బాధ్యత సమాజం మీద కాక కుటుంబ యజమాని మీద ఎందుకు పడింది ?.. అదే సమాజంలోని వ్యవస్థీకృత దోషం.
సమాజానికి తనలో జీవించే ప్రతి మనిషి యొక్క ప్రతి అవసరం తీర్చే శక్తి ఉన్నది. కానీ ప్రజలు పేదరికంలో మగ్గటానికి కారణం మనుషుల పోషణాభారం సమాజం మీద కాక కుటుంబం మీద ఉండటమే. ఒక పక్క గిడ్డంగులలో లక్షలాది టన్నుల ఆహార నిల్వలు కదలకుండా పడి ఉండటం, మరో పక్క అదే సమాజంలో కోట్లాది ప్రజలు తిండిలేక పస్తులుండటానికి ఇదే కారణం.
ఏ కారణం చేతనైనా కుటుంబ ఆదాయ వనరులు క్షీణిస్తే, ప్రస్తుత వ్యవస్థలో కుటుంబ సభ్యులంతా తమ అవసరాలు తీరక అల్లాడిపోతారు. కానీ వ్యక్తుల పోషణాభారం సమాజం మీద ఉండటం వలన ఎవరికీ ఈ దురవస్థ ప్రాప్తించదు. ఎందుకంటే ఏ కారణం చేత కూడా సమాజం ప్రజల అవసరాలను తీర్చలేని దుస్థితిలో ఉండదు. సమాజం యొక్క శక్తిసామర్ధ్యాలు అతినిశ్చితమైనవి. కుటుంబ యజమాని యొక్క శక్తి సామర్ధ్యాలు అలా కాక అనిశ్చితమైనవి (uncertain). అందువలన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే బాధ్యతను అతను నెరవేర్చవచ్చు లేక నెరవేర్చలేకపోవచ్చు. నెరవేర్చలేకపోవడమే పేదరికం. అప్రతిహతమైన శక్తి సామర్ధ్యాలను తనలో నిబిడీకృతం చేసుకొని ఉన్న సమాజం మాత్రం తనలోని ప్రతిఒక్కరి, ప్రతిఒక్క అవసరం ఖచ్చితంగా తీర్చగలుగుతుంది. అయితే అందుకు తగిన సామాజిక వ్యవస్థీకరణ లేకపోవడం వలన మాత్రమే ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రావడంలేదు.
ప్రజల కష్టాల నిర్మూలన కొరకు ప్రస్తుత వ్యవస్థ పరిధిలో వెదికే పరిష్కార మార్గాలన్నీ ఎండమావులే. వ్యవస్థ మార్పే అసలైన పరిష్కారం.
ప్రస్తుత వ్యవస్థలో సమాజం నెరవేర్చవలసిన బాధ్యతలను కుటుంబం మీదకు నెట్టడంతో తనవి కాని బాధ్యతలతో కుటుంబం కష్టాల వేదికగా మారింది. అన్ని బాధ్యతలు నెరవేర్చగలిన సమాజమేమో, ఏ బాధ్యతా లేకుండా కేవలం కొందరు స్వార్ధపరుల క్రీడాప్రాంగణంగా మారింది. వ్యక్తుల పోషణాభారం నుండి, వారి అవసరాలను తీర్చే బాధ్యత నుండి కుటుంబానికి విముక్తి కల్పించి ఆ బాధ్యతను సమాజానికి విధించాలి. అప్పుడే కుటుంబం కష్టాలమయమైన తన అసహజ రూపాన్ని వదలి, తన సహజ స్థితి అయిన ప్రేమ, ఆప్యాయతల నిలయంగా మారుతుంది.
ఎంతో సృజనశీలి, కార్యశీలి అయిన మానవుడు అసమర్ధుడై పేదవాడు కాలేదు. అసహజమైన బాధ్యతల బరువుతో మాత్రమే పేదవాడయ్యాడు. కుటుంబమనే బండిని లాగే కాడెద్దు కాదు మానవుడు. అతని జీవితం మరెంతో ఉన్నత విషయాలనుద్దేశించినది. అయితే ప్రస్తుత వ్యవస్థ మనిషిని ఆ కాడెద్దుగానే మార్చింది. మనసున్న ప్రతి ఒకరూ ఈ పరిస్థితిని ఎదిరించాలి. వ్యవస్థ మార్పుకొరకు ఆలోచించాలి. (written by Saraswathi Kumar)

Subscribe to:
Posts (Atom)